అమీర్‌పేట హోటల్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతుల అరెస్ట్

  • ధరమ్ కరణ్ రోడ్డులోని ఓయో టౌన్ విల్లాలో వ్యభిచారం
  • సోమవారం రాత్రి దాడిచేసిన పోలీసులు
  • రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు అరెస్ట్
హైదారాబాద్, అమీర్‌పేటలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ధరమ్‌కరణ్ రోడ్డులోని ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా వేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడి నిర్వహించి దందాకు పాల్పడుతున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇద్దరు యువతులు, హోటల్ మేనేజర్ ప్రేమ్‌తోపాటు రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు నాని అలియాస్ జోగేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు అరవన్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
Go Back to Shorts
Police
Hyderabad
ameerpet
hotel

More Telugu News